(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన చేపట్టాలని పోరాట కార్యాచరణ కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 11న సమ్మె నోటీసు ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 25 తర్వాత ఏరోజైనా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. పార్లమెంటులోని వివిధ పార్టీల నాయకులకు వినతిపత్రం అందించి వారి మద్దతు కూడగట్టాలని నిర్ణయానికి వచ్చారు.ఈనెల 20న జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో “ఉక్కు కార్మికుల గర్జన”ను స్టీల్ ప్లాంట్ త్రిష్ణ గ్రౌండ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. కిసాన్ మోర్చా ఢిల్లీ నాయకులతో ఈ నెల 28న భారీ బహిరంగ సభను నగరంలో నిర్వహించాలని తీర్మానం చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన జె. డి. లక్ష్మీ నారాయణ
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జె. డి. లక్ష్మీ నారాయణ తగిన సూచనలు అందజేశారు. సమావేశంలో సిహెచ్. నరశింగరావు, మంత్రి రాజశేఖర్, కన్వీనర్ జె. అయోధ్య రామ్, కో కన్వీనర్లు శ్రీ గంధం వెంకట్రావు, కె సత్యనారాయణ, సభ్యులు వై. టి. దాస్, మురళీరాజు, మసెన్, కె. శ్రీనివాస్, బొడ్డు పైడిరాజు, విళ్ళ రామ్మోహన్ కుమార్, గణపతి రెడ్డి, వరసాల శ్రీనివాస్, సిహెచ్. సన్యాసిరావు, డి. సురేష్ బాబు తదితరులతో పాటు ఒప్పంద కార్మిక సంఘాల ప్రతినిధులు శ్రీనివాసరాజు, నమ్మిరమణ, కె. అవతారం, యమ్. తాతారావు, పిట్టరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ మార్చి 8న పార్లమెంట్లో చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రధాన పరిపాలనా భవనం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
Must Read ;- విశాఖ స్టీల్‌లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా