కూటమి సర్కారు నేతృత్వంలో ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల వ్యవధిలోనే ఏపీకి ఏకంగా రూ. 3 లక్షల కోట్టకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. ఇంకా కొత్తగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా మరో భారీ పెట్టుబడి ఏపీకి వచ్చేందుకు రంగం సిద్ధం అయిపోయింది. ఈ కంపెనీ నుంచి సదరు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చిందంటే… అనంతపురం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోవడమే కాకుండా… హెలికాఫ్టర్ల తయారీ హబ్ గా ఏపీ రూపాంతరం చెందనుంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నా.. ఏపీకి సదరు పెట్టుబడి రావడం అయితే దాదాపుగా ఖాయమైపోయినట్టేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిర్ బస్.. హెచ్125 హెలికాఫ్టర్లను తయారు చేస్తోంది. ఈ హెలికాఫ్టర్లకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా హెచ్ 125 హెలికాఫ్టర్ల తయారీని మరింతగా పెంచాలని సదరు సంస్థ తీర్మానించింది. ఇందుకోసం ఓ నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని…దానిని భారత్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అయితే బారత్ ఎక్కడ యూనిట్ ను ఏర్పాటు చేయాలన్న దానిప ఇంకా సదరు కంపెనీ నిర్ణయం తీసుకోలేదు. భారత్ లోని చాలా రాష్ట్రాలను పరిశీలించిన ఎయిర్ బస్ ప్రతినిధులు…చివరకు 4 రాష్ట్రాలను షార్ట్ లిస్ట్ చేశారట. ఈ జాబితాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ ఉన్నాయట. ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాలతో సదరు కంపెనీ ప్రతినిధులు చర్చలు జరుపుతూనే ఉన్నారని సమాచారం.
ఇలాంటి అవకాశాలను ఏమాత్రం వదులుకునేలా కనిపించని చంద్రబాబు సర్కారు… రాష్ట్ర పరిశ్రమల శాఖను అప్పుడే రంగంలోకి దించేసిందట. అంతేకాకుండా ఎయిర్ బస్ హెలికాఫ్టర్ల తయారీ యూనిట్ కు అవసరమైన భూములను గుర్తించాలని ఇప్పటికే అనంతపురం జిల్లా అదికార యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ చేసిందట. ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం అదే పనిలో పడిపోయిది. అయినా అనంతపురమే ఎందుకు అంటే… జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూములు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా అతి తక్కువ ధరలకే భూములు లభిస్తున్నాయి. ఈ లెక్కన తక్కువ ధరలకు దొరికే భూములను ఇచ్చేందుకు ప్రతిపాదిస్తే.. ఎయిర్ బస్ కంపెనీ రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతుంది. ఎడారి జిల్లాగా పేరున్న అనంతపురంలో ఇటీవలే నీటి లభ్యత కూడా ఓ రేంజిలో పెరిగిపోయింది. వెరసి ఏ రకంగా చూసినా… ఎయిర్ బస్ ప్లాంట్ కు అనంతపురం జిల్లా సరిగ్గా సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇక గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా…కొరియా కార్ల కంపెనీ కియా అనంతపురంలో అడుగుపెట్టింది. సదరు కంపెనీ ప్లాంటు కారణంగా అనంతపురం ఇప్పుడు వరల్డ్ ఇండస్ట్రియల్ మ్యాప్ లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎయిర్ బస్ ప్రతినిధి బృందానికి వివరించిందట. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ఎయిర్ బస్ బృందం… సదరు ప్రతిపాదనలను తమ కంపెనీ యాజమాన్యానికి తెలియజేసిందట. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే… అతి త్వరలోనే ఎయిర్ బస్ ఏపీప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అదే జరిగితే… దాదాపుగా రూ.1 లక్ష కోట్ల మేర పెట్టుబడి ఏపీకి వచ్చేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.