నంద్యాలలో పోలీసుల వేధింపులు భరించలేక అబ్దుల్ సలాం కుటుంబం మొత్త ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటనపై అనేక అనుమానాలు బలపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల తరవాత పోస్టుమార్టం నిర్వహించేందుకు నంద్యాల ప్రభుత్వాసుపత్రి నిబంధనలు అనుమతించవు. ఒక వేళ సాయంత్రం 6 గంటల తరవాత పోస్టుమార్టం నిర్వహించాలంటే తప్పనిసరిగా జిల్లా కలెక్టర్, ఫోరెన్సిక్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా సలాంతోపాటు అతని కుటుంబ సభ్యుల మృతదేహాలకు సాయంత్రం 6 గంటల తరవాత అంటే చీకటి పడిన తరవాత పోస్టుమార్టం నిర్వహించడపై అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. ఖనన కార్యక్రమాల్లో ముస్లింల సాంప్రదాయాలను కూడా తుంగలో తొక్కారు. రాత్రి 12 గంటలకు ఒక్కో గోతిలో రెండు శవాలు వేసి ఖననం చేయడంపై కూడా సలాం అత్త మాబున్నీసా అనుమానాలు వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలే జామీను ఇచ్చారు
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన వ్యవహారంలో సీఐ, కానిస్టేబుల్ పై బెయిలబుల్ కేసులు మాత్రమే పెట్టించి, వారికి వైసీపీ నేత తాతిరెడ్డి తులసిరెడ్డి, మద్దిలేటి స్వామిరెడ్డి దగ్గరుండి సంతకాలు చేసి జామీను ఇప్పించారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు.
అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించిన వారిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంగిశెట్టి శ్రీధర్ రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. నిమిషాంబ జ్యూయలరీలో 2019 నవంబరు 7న దొంగతనం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న సీఐ ప్రభాకర్ రెడ్డిని వైసీపీ నేతలు ఎందుకు బదిలీ చేయించారో చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. జుయలరీ షాపు యజమాని మూడున్నర కిలోల బంగారం పోయిందని చెబుతున్నా పోటీసులు కిలోన్నర అని ఎఫ్ఐఆర్ లో ఎందుకు రాశారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
దొంగతనం జరిగిన రోజు సీసీ పుటేజీ పరిశీలించిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు. దాని ప్రకారం చర్యలు తీసుకోకుండా కావాలనే 25 సంవత్సరాలుగా అదే షాపులో నమ్మకంగా పనిచేస్తున్న అబ్దుల్ సలాంను, అతని కుటుంబాన్ని వేధించారనే సలాం అత్త మాబున్నీసా ఆరోపిస్తున్నారు.
Also Read ;- సాయం ఇచ్చారు సరే.. వివరాలకు అర్ధరాత్రి వెళ్తారా?
అబ్దుల్ సలాం కేసు సీబీఐకి అప్పగించాలిని టీడీపీ డిమాండ్
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు వైసీపీ నేతలు, పోలీసుల వేధింపులే కారణమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో దర్యాప్తునకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించాలని పట్టాభి డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించే వరకూ వదిలేదని లేదని పట్టాభి హెచ్చరించారు.
కేసును నీరుగార్చే ప్రయత్నం
అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న కేసును ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఆ కుటుంబంలో ఎవరూ మిగలకపోయినా రూ.25 లక్షల సాయం అందించి వారి బంధువుల నోరు మూయించాలని చూశారు. కానీ సలాం అత్త మాబున్నీసా ప్రభుత్వం పంపిన రూ.25 లక్షల చెక్కును కూడా తీసుకునేందుకు నిరాకరించారు. మాకు డబ్బు వద్దు. న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ నేతలు బలవంతంగా ఆమెకు ప్రభుత్వ సాయం చెక్కు ఇచ్చినా, ఆమె మసీదు అభివృద్ధికి ఆ చెక్కును ఇచ్చివేశారు.
ఈ కేసులో రూ.25 లక్షలు ఇచ్చి బాధితుల నోళ్లు మూయించాలని చూసినా, చివరకు ఆ పేద ముస్లిములు డబ్బు తీసుకోకుండా మాకు న్యాయం కావాలని మాత్రమే డిమాండ్ చేశారంటే అబ్దుల్ సలాం కుటుంబం, వైసీపీ నేతలు, పోలీసుల వేధింపుల వల్లే బలైందనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో సలాం కుటుంబానికి న్యాయం జరగాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read ;- సీఎం జగన్ ను కలవనున్న దివ్య తేజస్విని పేరెంట్స్











