ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్షలేకుండా ఇస్తే.. ఆ త్యాగానికి కులాన్ని ఆపాదించి, చిన్నచూపు చూశాడు జగన్! మూడు రాజధానులను ప్రకటించి, రైతు ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నించారు. ఒకే ప్రాంతానికి రైతు ఉద్యమాన్ని పరిమితం చేశానని సంబరపడిపోయాడు. కానీ అమరావతి రైతు చేస్తున్న ఉద్యమంలో న్యాయముంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు అమరావతి రైతు పక్షాన నిలబడ్డారు. అన్ని రాజకీయపార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఇటీవల చేపట్టిన న్యాయంస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన కార్యక్రమానికి విశేషస్పందన వచ్చింది. జగన్ రెడ్డి చేస్తున్న కుటీల రాజకీయాన్ని దేశానికి తెలిసేలా ఆ మహాపాదయాత్ర మహోజ్వలంగా సాగింది. దగా పడిన రైతు పక్షాన నిలిచిన ఎందరో.. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకోవడంపై తెరుకుని.. రాజకీయావసరం కోసం మూడు రాజధానుల బిల్లును జగన్ రెడ్డి అసెంబ్లీ ఉపసంహరించుకున్నారు. కానీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పి.. ఏపీ రాజధాని అమరావతిలో ఎటువంటి అభివృద్ధి పనులకు జగన్ ప్రభుత్వం మొగ్గు చూపడంలేదు. మరోవైపు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కనీసం పట్టించుకోకుండా మూడు రాజధానులకు అడుగులు వేయడాన్ని తీవ్రం ఖండిస్తున్నారు. రాజధాని రైత పట్ట జగన్ చూపుతున్న వివక్షపై రగిలిపోతున్నారు. అందేకే అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు జేఏసీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ నెలాఖరుకు ఉభయ గోదావరి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం
అమరావతి రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్నిపక్షాల వారు ఆధారిస్తున్నారు. ఫిబ్రవరి నెలఖరునాటికి ఉభయగోదావరి జిల్లాలో అమరావతి ఐకాసా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఐకాస కో – కన్నీనర్ గద్దె తిరుపతి రావు తెలిపారు. మార్చి నెల నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఐకాసల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. శ్రీకాకుళం నుంచి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతి ఉద్యమం రేపటితో 800వ రోజుకు చేరుతోందన్నారు. 800 రోజులుగా భూములిచ్చిన రైతులు రోడ్డునపడి పోరాడుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడం గమనార్హం!
Must Read:-అమరావతి రాజధానిలో భూముల తనఖా? అందుకేనా??











