అయ్యన్న ఇంటివద్ద హైటెన్షన్ !
విశాఖ జిల్లా, నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి అయ్యన్న ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు నోటీసులిచ్చేందుకు బుధవారం వచ్చారు. ఆయన ఇంట్లో లేరు అని చెప్పిన వినకుండా పోలీసులు అక్కడ తిష్టవేసి, నోటీసులిచ్చే వెళ్తాం అని భీష్మించారు. ఆయన ఇంట్లో లేరు అని కార్యకర్తలు చెప్పినా వినకుండా ఆయన బయటకు రావాలని, బయటికొస్తే నోటీసులిచ్చి వెళ్లిపోతామని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజెర్ల సీఐ రఘు చెప్పడంపై టీడీపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులిచ్చేందు వస్తే ఇంటి డోర్ కు అతికించి, వారి దారి వారు పోతారు.. కానీ ఇంటి ముందే కూర్చోని ఆయన వచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని పోలీసులు చెప్పడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇలా ఉదయం నుంచి సాగుతున్న పోలీసుల హైడ్రామా.. సాయంత్ర నాటికి అరెస్ట్ చేసేందుకే అన్నట్లు పెద్ద సంఖ్యలో పోలీసు అదనపు బలగాలు అయ్యన్న ఇంటిని చుట్టిముట్టాయి. మరోవైపు అయ్యన్న ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇంకోవైపు అర్థరాత్రి ఏదో ఒక సమయంలో అయ్యన్న అరెస్ట్ తప్పదంటూ చర్చ సాగుతోంది!
ప్రశ్నిస్తే అరెస్ట్ లేనా? ఇదెక్కడి సంస్కారం??
ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు! ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు విమర్శించకూడదు!! ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే.. దేశ ద్రోహం, నిలదీసి విమర్శిస్తే క్రిమినల్ కేసులు పెట్టడం వంటివి చూస్తే.. ఏపీలో భావప్రకటన స్వేచ్ఛకు సంకేళ్లు వేయడమే తప్ప, మరోకటి కాదు అన్నది సుస్పష్టం! ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. సీఎం జగన్ పై అయ్యన్న కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే గుప్పించారే తప్ప.. వ్యక్తిగత దూషణలు, బూతులు పురాణం అందుకోలేదు. దానికే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు సీఐ రఘు, ఎస్ఐ శ్రీహరిరావు, అవినాష్ తో పాటు పోలీసులు సిబ్బంది భారీ సంఖ్యలో అయ్యన్న ఇంటికి వచ్చారు. 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్తునే.. మరోవైపు గంటగంటకు పోలీసు బలగాలను అయ్యన్న ఇంటి పరిశర ప్రాంతాలలో దించుతున్నారు. ప్రత్యేక బలగాలు ఇంటి చుట్టు పెద్ద సంఖ్యలో మోహరించాయి. నోటీసు ఇచ్చేట్లయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో రావాల్సిన పనెంటని తెదేపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అయ్యన్న ఇంటి వద్దకు వచ్చి చేరుతున్నారు.
Must Read:-ఎన్టీఆర్ భవన్లో తెదేపా ‘నారీ సంకల్ప దీక్ష’!











