రాజకీయానికి మూడు రాజధానులు.. తనఖాకు అమరావతి భూములా?
ఉద్యోగుల నిరసనలను కూడా జగన్ రెడ్డి తనకు అనుకూలం మార్చుకున్నారు. అసలు అమరావతి అంటే గిట్టని ముఖ్యమంత్రిగారికి.. రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించి, వేల ఎకరాలు సమీకరణ, సేకరణ ద్వారా అందజేసిన భూమి నేడు ఆయన అవసరాలకు గుర్తొచ్చిందా? అంటూ రైతులు నిలదీస్తున్నారు. అధికారం ఉంది కదా.. అని ఏకంగా 480 ఎకరాల భూమిని సీఆర్డీఏ రుణం కోసం బ్యాంకులకు తనఖా పెట్టినటేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం! ఈ భూమిని మందడంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. అయితే సీఆర్డీఏ తీసుకుంటుంది పూర్తిగా కొత్త రుణమా? లేక గతం హడ్కో రుణం కోసం తనఖా పెట్టిన భూమిని ఇప్పుడు ఎంఐజీ స్మార్ట్ టౌన్ షిప్ కోసం కేటాయించినందున దాన్ని విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా భూమిని తనఖా పెట్టిందా? అన్నది తేలాల్సి ఉంది!
రూ. 3 వేల కోట్ల రుణం కోసమేనా?
ఉద్యోగుల విషయంలో అత్యతం చిన్నచూపు చూస్తు ప్రకటించిన పీఆర్సీని నిరసిస్తూ పోయిన శనివారం పెన్ డౌన్ చేసి.. ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 480 ఎకరాల రాజధాని భూమిని తాకట్టుకు సంబంధించిన ప్రాసెస్ ను ఒత్తిడి తీసుకొచ్చిమరి, వడివడిగా ముగించారుె. అనంతవరం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో రైతులు నుంచి భూసమీకరణలో ఇచ్చిన భూమి, సీఆర్డీఏ వాటాకు వచ్చిన భూమి కొంత బ్యాంకులకు తనఖా పెట్టినట్లుగా సమాచారం. మొత్తం ఈ భూమిని బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టి రూ. 3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది!
Must Read:-జగన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాకిచ్చిన ఉద్యోగులు..! ఇక ప్రభుత్వం పనైపోయినట్లే!!