బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి.. అనతి కాలంలోనే బాగా పాపులర్ అయిన యాంకర్ టర్నడ్ యాక్టరస్ అనసూయ. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం, విన్నర్, కథనం తదితర చిత్రాల్లో నటించింది. అయితే.. అనసూయకు ఈ సినిమాల్నీ ఒక ఎత్తు అయితే.. రంగస్థలం సినిమా ఒక ఎత్తు. ఈ మూవీలో రంగమ్మత్త క్యారక్టర్ లో అనసూయ అద్భుతంగా నటించింది. అప్పటి నుంచి అనసూయ కెరీర్ లో బాగా బిజీ అయ్యింది.
ఇదిలా ఉంటే.. బుల్లితెర మీద, వెండితెర మీద ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఎవరైనా తేడాగా మాట్లాడితే.. దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇవ్వడం అనసూయ స్టైల్. లేటెస్ట్ గా అలాగే చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. దాదాపు మూడేళ్ల క్రితం అనసూయ ఓ షోలో యాంకరింగ్ చేస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. దానికి సంబంధించిన ఫొటోలను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పలు ఆరోపణలు చేశాడు.
ఈ షో పబ్లిసిటీ కోసమే అనసూయ అలా కళ్లు తిరిగిపడిపోయినట్లు నటించిందని చెబుతూ ఓ నెటిజన్ అసభ్యకరంగా ఓ కామెంట్ చేశాడు. అంతే అనసూయకు బాగా కోపం వచ్చింది. ఆమె కూడా అతని స్టైల్ లోనే అసభ్యపదజాలం వాడుతూ తిట్టి పోస్ట్ చేసింది. ఇటువంటి కామెంట్ చేయడం చాలా తేలికని చెప్పింది. తనకు లోబీపీ ఉందని, అప్పట్లో తాను 22 గంటలపాటు కంటిన్యూగా షూట్‌లో పాల్గొన్నానని తెల్లవారుజామున 5.30 గంటలకు ఆ ఘటన జరిగిందని వివరించింది.
దానిని వేరేలా ఎందుకు అర్థం చేసుకుంటున్నారని, అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండానే తనపై ఎలా కామెంట్ చేస్తావు? అంటూ ఆ నెటిజన్ ను అనసూయ నిలదీసింది. అంతే కాకుండా.. తనని అసభ్యపదజాలంతో తిట్టాలనే ఉద్దేశ్యంతోనే ఎప్పుడో మూడేళ్ల క్రితం వీడియో తీసి ఇప్పుడు పోస్ట్ చేసి కామెంట్ చేస్తున్నావా..? నేను కూడా ఎలాంటి సిగ్గు, భయం లేకుండా తిట్టగలను అయితే.. తనని తల్లిదండ్రులు అలా పెంచలేదని చెప్పింది.
Also Read: 3 నిమిషాల సాంగ్ కోసం అనసూయ అంత తీసుకుందా?











