‘ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి’ అంటూ ఓ పాటుంది. బాలీవుడ్ దర్శకనటుడు ఓ పక్క అటు పాయల్ ఘోష్ కంకణం కట్టుకుని ఉంటే ఈ నిందల నుంచి అనురాగ్ ను ఎలాగైనా బయట పడేయాలని మరో ఇంతి తాపత్రయపడుతోంది. మా ఆయన నోట్లో వేలు పెడితే కొరకలేడు అన్నట్లుగా ఆమె మాట్లాడుతోంది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ఆయన మాజీ భార్య, నటి కల్కీ కొచ్లిన్. ఇది ఆయనకు ఎన్ని గ్రాముల మద్దతుగా పనికొస్తుందో తెలియదుగానీ తన ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఓ లేఖ పడేసింది.
ఇంతకీ ఆ లేఖ సారాంశమేంటో చూద్దాం.. ‘ప్రియాతి ప్రయమైన నా అనురాగ్.. మీపై ఎవరెన్ని రాళ్లేసినా పట్టించుకోకండి. మీకు మహిళలంటే ఎంత గౌరవమో నాకు తెలుసు. దానికి నాకన్నా పెద్ద సాక్షి ఎవరూ ఉండరు. మహిళల స్వేచ్ఛను మీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. వక్తిగతంగానూ, వృత్తిగతంగానూ నాకెంతో అండగా నిలబడ్డారు. నేను నటించేటప్పుడు ఇబ్బందులుపడుతున్నప్పుడు మీరెంత అండగా నిలిచారో నాకు తెలుసు. మనమిద్దరం విడిపోయిన తర్వాత కూడా మీలోని చిత్తశుద్ధి నాకు నచ్చింది.
నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేసేవారు ఉంటారు. ఇలాంటివారి వల్ల అందరం ఇబ్బందులు పడుతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మీకు అండగా నిలిచే వ్యక్తులుంటారని మరచిపోవద్దు. మీరు ధైర్యంగా నిలబడండి చాలు. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి.’ అని ఆమె తన లేఖలో పేర్కొంది. ఈ విషయంలో నటి తాప్పి కూడా అనురాగ్ కు మద్దతు తెలిపింది. వావ్.. అనురాగ్ కు మహిళల నుంచి ఇంత మద్దతు ఉందా అనిపిస్తోంది. పాయల్ వ్యూహం బెడిసికొట్టేలా ఉంది. చివరికి ఇది ఇంతుల పోరుగా మారిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అప్పుడు ఇంతుల పోరు ఇంతింత కాదయా అనుకోవాల్సిందే.











