దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్ర ఓ కొత్త వివాదానికి తెరతీశారు. ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామికి వారు జర్నలిజంలో ఎక్స లెన్స్ అవార్డు ఇవ్వనున్నట్లు రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి వెళ్లారు. వారు ఇవ్వబోయిన బహుమతి చెప్పులతో చేసినది. అయితే సిబ్బంది వారిని తమ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. దాంతో వారు వెనుదిరగక తప్పలేదు. అసలు వారికి అర్నబ్ మీద అంతకోపం ఎందుకు అనడానికి కూడా కారణాలు ఉన్నాయి.
ఓసారి విమాన ప్రయాణంలో ఉండగా అర్నాబ్ తో గొడవకు దిగారు. అర్నాబ్ పిరికి పందగా అభివర్ణించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పుడు చెప్పుల ఫ్రేమ్ తో వెళ్లడంలో అంతరార్థం ఏమిటన్నది మనం అర్థం చేసుకోవాచ్చు. అంతకుముందు ఓసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కూడా అనురాగ్ కశ్యప్ విరుచుకుపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తదితరులపై దేశద్రోహ ఆరోపణలకు ఢిల్లీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అప్పుడు కూడా ఇలాగే ట్విట్టర్ వార్ కొనసాగించారు.
Birthday boy @anuragkashyap72 & me went to the @republic’s office to give Arnab an excellence in journalism award… Republic security said bina permission ke allowed nahi hai…
😂😂😂 pic.twitter.com/nCMp8oqpQZ
— Kunal Kamra (@kunalkamra88) September 10, 2020











