కడపలో మహానాడు నిర్వహించడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికలకు టీడీపీ ఇప్పటి నుంచి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తన్నట్లు తెలుస్తోంది. జగన్ సొంత ఇలాఖా కడపలోనే వైసీపీకి సమాధి కట్టాలని తెలుగుదేశం హైకమాండ్ వ్యూహాలు రచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే వై నాట్ పులివెందుల కోసం పక్కా వ్యూహాంతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇక జగన్ జైల్లో ఊచలు లెక్కపెట్టడం ఖాయమని మహానాడు సాక్షిగా చంద్రబాబు ఇప్పటికే ఇండికేషన్స్ ఇచ్చారు.
జగన్ సొంత జిల్లా కడపలో మొదటిసారి నిర్వహిస్తున్న మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. కడపలో మహానాడు ఏర్పాటు చేయడం వెనక పెద్ద ప్లానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో కడపలోని 10అసెంబ్లీ స్థానాలకు కూటమి ఏకంగా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. కడపను కంచుకోటలా భావించే వైసీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. అంటే కూటమి హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వచ్చే ఎన్నికల్లో కడపలో కాస్త కష్ట పడితే క్లీన్‌స్వీప్ చేయడం కష్టమేం కాదన్న భావనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగరేసి..జగన్‌ను ఇంట్లో కూర్చొబెట్టాలనేది తన ప్లాన్‌గా చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
జగన్ ఇలాకాలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల వెనక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. జగన్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పై ఇప్పటికే చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు పుష్కలం. ఇక లిక్కర్ స్కామ్ కూడా రెడీగా ఉంది. ఈ కేసు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్తే గతంలో షర్మిలలాగా పార్టీని చూసుకునే వాళ్లు లేరు. భార్య భారతి అన్ని తానై నడిపించినా, ఆమెకు ప్రజల పల్స్ పట్టుకునేంతా కెపాసిటీ లేదనేది జగనెరిగిన సత్యం. మిగిలిన నేతల్లో సీనియర్లు ఉన్నప్పటికీ..వాళ్లు ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఓవరాల్‌గా రాష్ట్ర స్థాయిలో పట్టున్న నేతలు వైసీపీలో ఇప్పుడు కరవయ్యారు. దీంతో వైసీపీ ఫ్యూచర్ ని అంచనా వేసే చంద్రబాబు..వచ్చే ఎన్నికల్లో కడపలో స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.











