వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పవర్ పోవడంతో మైండ్ బ్లాంక్ అయిందనే చర్చ మొదలయింది..
2024 ఎన్నికలో ప్రజలు ఆయనని ఎలా ఈడ్చి పెట్టి కొట్టారో, లాగిపెట్టి తన్నారో ఆయన మరిచిపోయినట్లున్నారు.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్‌ని లాగిపెట్టి కొట్టారు.. ఏడాది క్రితం జరిగిన ఎన్నికలలో జగన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు.. కేవలం 11 స్థానాలతో సరిపెట్టారు. ఈ విషయం మరిచిపోయిన జగన్… తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబుని వచ్చే ఎన్నికలలో ఈ పక్కన తన్నితే, ఆ పక్కన పడతారని కామెంట్ చేశారు.. అయితే, తనని నిన్నటి ఎన్నికలలో లాగి పెట్టి తన్నారని ఆయన పూర్తిగా మరిచిపోయారని గుర్తు చేస్తున్నారు.. అలా ఎగిరి ఎగిరి తన్నితేనే ఆయనకు చరిత్రలో ఏ పార్టీకి దక్కని పరాజయం పొందారని వ్యాఖ్యానిస్తున్నారు..
మరోవైపు, ఇప్పటికే ఆయన కోర్ టీమ్‌లోని చాలా మంది జైళ్లలో మగ్గుతున్నారు. అవినీతి, అరాచకంతో ఊచలు లెక్కపెడుతున్నారు.. లిక్కర్ స్కామ్‌లో కీలక ఆధారాలు బయటపడ్డాయి.. తాజాగా ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది.. ఇదే దూకుడు కొనసాగితే, జగన్ అరెస్ట్ అవడం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి.. దీనికితోడు, కడపలో జరుగుతోన్న తెలుగు తమ్ముళ్ల పండగ మహానాడు తిరుగులేని విజయాన్ని అందుకుందనే రిపోర్టులు జగన్‌కి చేరిపోయాయి.. జగన్ సొంత గడపలో జరుగుతోన్న ఈ మహానాడు ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయనకి దిమ్మ తిరిగిపోయింది.. దీంతో, మతి భ్రమించి అవాకులు, చెవాకులు పేల్చుతున్నాడు జగన్ అని చెబుతున్నారు ఎనలిస్టులు..
జగన్ ప్రస్తుతం నడిసముద్రంలో ఉన్నారు.. ఆయనపై ప్రజల్లో నమ్మకం సడలిపోయింది.. అయిదేళ్లు విచ్చలవిడిగా అధికారం అనుభవించి ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారు. ప్రజలను దూరం పెట్టారు.. లిక్కర్, ఇసుక, మైనింగ్ స్కామ్‌లతో వేల కోట్లు ఆర్జించడానికే తన పదవిని, పవర్‌ని ఉపయోగించుకున్నాడు జగన్ అని ముద్ర వేయించుకున్నాడు.. తాజాగా, వీటిపై విచారణలు సాగుతున్నాయి.. అంతేకాదు, తన మందీమార్బలంతో ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టించాడు. నాడు ప్రతిపక్ష నేతలని, వారి ఇంటి మహిళలని దూషించిన జగన్ టీమ్‌లో మెజారిటీ మెంబర్స్ జైలులో ఉన్నారు.. వీటి నుండి జగన్ బయటపడడం అంత ఈజీ కాదు.. ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారు…
ప్రతిపక్ష నేతగా జగన్ ఆశలు పెట్టుకుంది కేవలం కూటమి సర్కార్ పథకాలను అమలు చేయడం లేదని.. ఆయనకి తెలియని విషయం ఏంటంటే, త్వరలోనే సూపర్ సిక్స్‌లోని మెజారిటీ పథకాలు పట్టాలెక్కబోతున్నాయి.. జూన్ పదో తేదీలోపు తల్లికి వందనం స్కీమ్ అమలు కానుంది. ఆగస్ట్ నుండి ఫ్రీ బస్ స్కీమ్ పరుగులు పెట్టనుంది.. ఇటు, రైతు భరోసా పథకం షురూ కానుంది.. ఇవి అన్నీ అమల్లోకి వస్తే జగన్ అనే నాయకుడు ఉన్నాడా అని ప్రజలు ఆలోచించడం ఖాయమని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.. అందుకే, ఈ పక్కన తన్నితే ఆ పక్కన పడిపోయానని సంగతి జగన్‌కి పక్కాగా అర్ధం కావడంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి.. తనని తన్నిన విషయాన్ని అవగతం అవడంతో వాటిని ఇలా బయటపెడుతున్నాడని చెబుతున్నారు..










