వ్యవస్థలో లోపాలు సరిచేస్తాం..
సిని పరిశ్రమలో లోపాలు సరిచేసి, చిత్ర పరిశ్రమను నిలబెట్టాలని తపన తమ ప్రభుత్వానికి ఉందన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కొత్త జిల్లా పునర్విభజన పై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం జగన్ రెడ్డి మాట్లాడారు. ఏ సినిమా అయినా.. ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఉన్నంతలో మంచి పాలసీని తీసుకురావాలనన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. పెద్దా, చిన్నా తేడా లేకుండా సినిమాలకు న్యాయం జరగాలన్నారు. ఏపీలో ఒక్కొక్కళ్లకి ఒక్కో సిమా ఉండదని జగన్ పేర్కొన్నారు. భారీ బడ్జెట్ సినిమాల అంశపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పుకొచ్చారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ సినిమాల రెమ్యునరేషన్లు విషయంలోనూ ఆలోచన చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా సిని ప్రముఖల భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలపై ఒక స్పష్టమైన క్లారిటీని ఇచ్చినట్లు తెలుస్తోంది! చివరగా .. రెండోసారి సీఎంతో చిత్ర సీమ ప్రముఖల భేటీ ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయా? లేదా అన్నది పక్కన పెడితే.. జగన్ మాత్రం పూర్తి క్లారిటీ ఇచ్చారు. టికెట్ ధర సామాన్య ప్రజలకు టీ ధరకే అందించాలన్నదే ఆయన ఆలోచనగా కనిపిస్తోంది! ఏపీలో పెరుగుతున్న నిత్యావసరాలపై, పెట్రోల ధరలపై, ఇనుము, ఇసుక, సిమెంట్, మద్యం, వపర్ చార్జెస్ వంటి అనేక ధరలపై.. ఈ మాదిరిగానే దృష్టిసారించి ఉంటే ప్రజలు నెత్తినపెట్టుకుని పూజించే వాళ్లెనెమో! పక్క రాష్ట్రాల కన్నా పై వాటిని తగ్గించి ప్రజలకు అందిస్తుంటే.. సినిమా టికెట్ ధర తగ్గిపు విషయంలో థియేటర్ యాజమాన్యాలు, సిని వర్గాలు పెద్దగా పట్టించుకోకపోయి ఉండేవారు. కానీ అన్నీంటిని అలా గాలికొదిలేసి.. సినిమా వాళ్లనే ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారన్నది ప్రజలకు తెలియనిది కాదు!!
ధరల విషయం నో రాజీ .. పతనం కూడా ఖాయమేగా!?
చిత్ర సీమ నుంచి ఏపీకి పైసా కూడా ఆదాయం లేదు అన్నది జగన్ రెడ్డి ప్రభుత్వ ఆలోచనలు. తెలంగాణ కంటే అత్యథిక థియేటర్లు ఉన్న ఏపీని సిని నిర్మాతలు చిన్నచూపు చూస్తున్నారని, వారిని టార్గెట్ చేస్తే.. దిగివచ్చి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటారని ఆలోచనలో ఉన్నట్లు ఉన్నారు కాబోలు.. అందుకే టికెట్ ధరలపై టార్గెట్ చేశారు. గురవారం చిత్ర సీమ నుంచి చిరంజీవి నేతృత్వంలో పెద్దలు కలిసినప్పటికీ జగన్ నిర్ణయంలో ఆశించిన మేరకు టికెట్ ధరలో మార్పులేమి ఉండవు అన్నది తేటతెల్లమౌతోంది! టికెట్ ధరలు తగ్గిస్తే.. థియేటర్లు నిర్వాహణ భారమై మూతవేస్తారు. తద్వారా అనుబంధ రంగాలు, ఉపాధిని పొందుతున్న వారు రోడ్డును పడుతారు. ఏపి వ్యాప్తంగా సినిమా థియేటర్ల పై ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నది అంచన. జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో వీరిందరూ ఉపాధి కోల్పోయి రోడ్డుపడుతున్నారు. సిని పరిశ్రమలో భారీ, మధ్య తరహా బడ్జెట్ చిత్రాలు ఏడాదికి ఒకటో,రెండో రిలీజ్ అవుతాయి. మిగతా అన్ని చిన్న తరహా బడ్జెట్లోనే మేకర్స్ పూర్తి చేస్తారు. భారీ బడ్జెట్ చిత్రాలు దండగలో పండగ మాదిరిగా ఏపీ ప్రభుత్వం విధించిన అల్ప టికెట్ ధరలకే సినిమా టికెట్స్ అమ్మకాలు చేసి నష్టపోయినప్పటికీ.. సోషల్ మీడియా ప్రమోషన్ ద్వారా కొంత, ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా మరికొంత సమకూర్చుకుని మమ అనిపించుకుంటారు. ఇంకోవైపు చిన్న చిత్రాలయితే నేరుగా ఓటిటి ప్లాంట్ ఫాంలో రిలీజ్ చేసుకుంటారు. అంతిమంగా టికెట్ ధరల తగింపుతో ప్రభుత్వానికి ఒరిగేదెమి లేకున్నా.. థియేటర్ యాజమాన్యాలు, ఆధార రంగాలు తీవ్రంగా నష్టపోతాయి. థియేటర్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు ఉపాధి కోల్పొతారు. వీరే ప్రభుత్వ పతనానికి శక్తులుగా పనిచేస్తారు. ఇప్పటికే అనేక రంగాల్లో ఉపాధి కోల్పోతున్నావారు కూలీలు, ప్రభుత్వ ఉద్యోగుల, నిరుద్యోగులు అధికార పార్టీకిచ్చిన అధికారాన్ని ఊడకొట్టి.. ఇంటికి పంపాలని కంకణబద్ధులై, ఆ స్థాయిలో పనిచేస్తున్నారన్న విశ్లేషణలు లేకపోలేదు!











