చర్చోపచర్చల ఫలితాలు ఇవే
సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలను శుక్రవారం పొద్దుపోయే వరకు కొనసాగించింది. చర్చోపచర్చలు తరువాత హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం! 2 లక్షల వరకు జనాభా ఉంటే 8 శాతం హెచ్ఆర్ఏ ప్రతిపాదించింది. 2-5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్ఆర్ఏ, 5 – 15 లక్షల జనాభా ఉంటే 16 శాతం హెచ్ఆర్ఏ ను ప్రతిపాదించింది. 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 24 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని పేర్కొంది. అదనపు క్వాంటం పింఛన్ లో 70 ఏళ్ల వారికి 5 శాతం ప్రతిపాదించింది. అదనపు క్వాంటం పింఛన్ లో 75 ఏళ్ల వారికి 10 శాతం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది!
సీపీఎస్ రద్దు సంగతేంటి?
మంత్రుల కమిటీతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు సీపీఎస్ రద్దు ప్రస్తావనను లెవనెత్తారు. అయితే సీపీఎస్ రద్దుపై మరో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని.. చర్చల దృష్ట్యా సమయం కావాలని మంత్రులు కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులను కోరారు. ప్రభుత్వం సూచించిన అంశాలపై నిర్ణయం తెలపాలని ఉద్యోగ సంఘాల నేతలును కోరారు. ఆ తరువాత ఉద్యోగ సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించుకున్నారు. కీలక అంశాలతో కూడిన డిమాండ్స్ ను మంత్రుల కమిటీ సమర్పిచారు. ఈ క్రమంలో హెచ్ఆర్ఏపై ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాల దృష్టికి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం!











