కరోనాతో ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వారం వ్యవధిలో నలుగురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందారని, మృతుల కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ప్రణాళికా లోపమే..
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపమే ఉద్యోగుల మృతికి కారణమని చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల రక్షణపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదని, ఉద్యోగులు మాత్రం విధులకు హాజరవ్వాల్సిందేనని చెప్పడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
Must Read ;- మూడు రోజుల్లో ముగ్గురి మృతి.. ఏపీ సెక్రటేరియట్‌లో కరోనా కలకలం











