యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అరాచకాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఎమ్మెల్యే కన్నబాబు బెదిరిస్తున్నారంటూ అప్పారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆయనపై దాడి చేశారన్నారు. ఈ మేరకు లోకేష్ ఎమ్మెల్యే అరాచకాలను ట్విటర్‌లో పోస్టు చేశారు.
‘దౌర్జన్యాలకు ప్యాంటు, అక్రమాలకు షర్టు వేసినట్టుండే యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. నియోజకవర్గంలో కన్నబాబు చేసిందే చట్టం, చెప్పిందే వేదం, కన్నుపడితే కబ్జా ఖాయం’ అని విమర్శించారు.
‘రాంబిల్లికి చెందిన దళితుడు భూపతి అప్పారావు (పండు) తనకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని 22-03-2021న పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే చేసిన పాపంగా చంపేయడానికి యత్నించారు రౌడీ ఎమ్మెల్యే అనుచరులు’ అని లోకేష్ మండిపడ్డారు. ‘దళితులపై దమనకాండ సాగించేందుకు తన ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? ఇలా చెలరేగిపోతున్నారు’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Also Read:పుంగనూరు వీరప్పన్ మంత్రి పెద్దిరెడ్డి.. నారా లోకేష్
https://twitter.com/naralokesh/status/1384033946082562056?s=20











