రైతుల పక్షాన నిలబడ్డ తన కార్యకర్తలపై, పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇది పోలీస్‌స్టేషనా.. కలెక్షన్ సెంటరా?..’ అంటూ నాగర్ కర్నూలు పోలీసులనుద్దేశించి అన్నారు. అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను పార్టీ కూడా మారుతున్నానని పోలీసులే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరు వల్ల ప్రజలు భయపడుతున్నారని, వాళ్ల వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు. పోలీసులు తన కార్యకర్తలను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పోలీస్ స్టేషన్లను, కలెక్షన్ సెంటర్లుగా పోల్చడంతో ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Must Read ;- పోలీస్ స్టేషన్ ముందే పరిటాల శ్రీరామ్‌పై దాడికి వైసీపీ నేతల యత్నం..











