గడిచిన మూడు రోజుల్లో ఏపీ సెక్రటేరియట్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. కరోనా సెకండ్‌వేవ్ భయంతో అక్కడ పనిచేయాలంటేనే ఉద్యోగులు వణికిపోతున్నారు. పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న శాంత కుమారి ఈ రోజు ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం శాంత కుమారి భర్త, సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కూడా కరోనాతో మృతి చెందారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతి ఇవ్వాలంటూ సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్‌కు కరోనా పాజిటివ్…