కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని ఎనిమిది మంది ఐఏఎస్ లు ధర్మాసనానికి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో హై కోర్టు శిక్షను మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ స్థలాల్లో , పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయ భవనాలు నిర్మించడం పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ… వాటిని వెంటనే తొలగించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.అయితే ప్రభుత్వ అధికారులు వీటీ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సంబంధీనట అధికారులపై కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన ధర్మాసనం విచారణను ప్రారంభించింది.ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్రంలోని ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్న విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్ లకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఎనిమిది మంది ఐఏఎస్ లు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని, అదేవిధంగా ఏడాది పాటు సంక్షేమ హాస్టల్లో ఒక్కపూట భోజనం పెట్టాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Must Read:-జగన్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ