ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విశాఖ బీచ్ ను కబ్జా చేసి..భారీ బీచ్ రిసార్టును కట్టాలనుకున్న ఆయన నిర్వాకం సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన కూతురు నేహారెడ్డి పేరుతో ఓ భారీ హోటల్ కట్టాలని విజయసాయి ప్లాన్ చేశారు. అందులో భాగంగా వైసీపీ హయాంలోనే బీచ్‌ను కబ్జా చేశారు. ఐతే ఎప్పుడు వేశారో తెలీదు కానీ…బీచ్‌లో గోడలు కట్టేందుకు 8 నుంచి 10 అడుగుల లోతులో కాంక్రీట్ గోడలు కట్టేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వాటిని పెకిలిస్తున్న అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంత లోతులో ఎప్పుడు తవ్వి కాంక్రీట్ పోశారనేది వారికి కూడా అర్థం కావడం లేదు.
వైజాగ్ బీచ్‌లో అక్రమాలపై హైకోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది. తవ్వే ఖర్చు కూడా ఆ కట్టడాలు నిర్మించిన నేహా రెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. అంతే కాదు వాటిని తొలగించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అందుకే చాలా వేగంగా వాటిని తొలగిస్తున్నారు. అన్ని అనుమతులతోనే CRZ-2 ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టామని నేహారెడ్డి వాదించారు. జనసేన నేత కార్పొరేటర్ PLVN మూర్తి యాదవ్ పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతోంది.
నిర్మాణానికి వినియోగిస్తున్న భారీ యంత్రాలను సీజ్ చేయాలని గత సెప్టెంబర్ లోనే ఆదేశించారు. హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. వారు నిబంధనలు ఉల్లఘించి బీచ్ లో నిర్మాణాలు చేస్తున్నది నిజమేనని తేలడంతో పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. ఆ మేరకు స్టేటస్ రిపోర్టు కూడా సమర్పించాలని ఆదేశించారు దీంతో విశాఖ తీరంలో లోతుగా తవ్వి కాంక్రీట్ పునాదుల్ని తొలగిస్తున్నారు.