అసెంబ్లీకి దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి.. దొడ్డిచాటున పారిపోతున్న వైసీపీ ఎమ్‌ఎల్‌ఏలపై సీరియస్ అయ్యారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. విపక్షానికి చెందిన కొందరు ఎమ్‌ఎల్‌ఏలు అసెంబ్లీలో అడుగుపెట్టి, శాసనసభ సమావేశాలకు హాజరు కావడంలేదని, అలాంటి వారికి తగిన పాఠాలు నేర్పుతామని శాసనసభ సాక్షిగా విరుచుకుపడ్డారు అయ్యన్నపాత్రుడు.. ముఖ్యంగా ఏడుగురు వైసీపీ ఎమ్‌ఎల్‌ఏలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి పారిపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.. వీరిపై జగన్ ఫైర్ అయినట్లు వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది..
ఎమ్‌ఎల్‌ఏలు బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, విరూపాక్ష, విశ్వేశ్వర రాజు, ఆకేపాటి అమర్‌నాధ్ రెడ్డి, దాసరి సుధ, మత్స్యలింగం.. శాసనసభకు వేర్వేరు రోజులలో వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారు.. దీనిపై ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడుగురు ఎమ్‌ఎల్‌ఏలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. వీరిని దొంగలుగా ముద్ర వేసినట్లు చెబుతున్నారు వైసీపీ నేతలు.. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొద్దని ఆదేశించినా, ఇలా దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏంటని నిలదీశారట జగన్.. వేటు వేస్తారనే భయం ఉన్నా.. సాంకేతికంగా ఒక రోజు సభకు వెళ్లి సంతకం పెట్టి వచ్చాం కదా అని గుర్తు చేశారట.. కానీ, తనను మోసం చేస్తూ ఇలా అసెంబ్లీకి వెళ్లడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం..
తమ పార్టీ అధినేత జగన్.. ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, వారి సమస్యలు పరిష్కరించాలని తమను అసెంబ్లీకి పంపితే, ఇలా డుమ్మా కొట్టడం సమంజసం కాదని వైసీపీ ఎమ్‌ఎల్‌ఏలలో మెజారిటీ మెంబర్స్ అభిప్రాయ పడుతున్నారు.. జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఈ నేతలు అసంతృప్తిగా ఉన్నారు.. అందుకే, తమని గెలిపించిన ప్రజల తీర్పుని శిరసావహిస్తూ అసెంబ్లీలో ప్రశ్నలు సంధించడానికి ముందుకు వచ్చారు.. అయితే, జగన్ బెదిరిస్తున్న తీరుని వ్యతిరేకిస్తూ, ఈ ఎమ్‌ఎల్‌ఏలు శాసనసభా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు….
జగన్.. వారి ఉద్దేశ్యాలని, అభిప్రాయలని గౌరవించకుండా, తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు శాసనసభా సమావేశాలకు రానని భీష్మించారు.. ఇటు వారిని కూడా అడుగుపెట్టవద్దని హుకుం జారీ చేశారు.. కానీ, ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని ఈ ఎమ్‌ఎల్‌ఏలు మధనపడుతున్నారని తాజా పరిణామాలతో సంకేతాలు పంపారు ఈ ఎమ్‌ఎల్‌ఏలు.. ఇదే రీతిన జగన్ మరో ఏడాది పాటు వ్యవహరిస్తే, ఆ పార్టీకి, ఆయన నియంతృత్వ పోకడలకు గుడ్ బై చెప్పడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. అది వెన్నుపోటు కాదని, ప్రజల భావనలను గౌరవించడమని వ్యాఖ్యానిస్తున్నారు. అహంకారం, అహంభావంతో విర్రవీగే జగన్‌కి ఇవి వినిపిస్తాయా…?? కనిపిస్తాయా..??