అమరావతి రాజధానిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించిన పోలీసు శాఖపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అయితే ‘రూల్ ఆఫ్ లా’ ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్సీ రైతులను 18 రోజులు జైల్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించింది. ఇలా చేస్తే రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని న్యాయస్థానం పేర్కొంది. రైతులను అరెస్ట్ చేసేందుకు సరైన కారణాలు ఎందుకు చూపించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కారం కింద తీసుకొనే అధికారం కోర్టుకు ఉందని తెలిపింది. రాజ్యాంగం ప్రకారమే పోలీసులు నడుచుకోవాలని , ఇలా చేస్తే ప్రజలు న్యాయం కోసం ఎక్కడకెళ్తారని హైకోర్టు పోలీసుల తీరును తప్పుబట్టింది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్ కూడా సరిగా లేదని విస్మయం వ్యక్తం చేసింది. రైతుల తరపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వినిపించిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.
Must Read ;- గీతదాటిన పోలీసులు సంజాయిషీ చెప్పాల్సిందేనా?











