తల్లి కాబోతున్నాం అనే వార్త ఆడవారికి ఎంత సంతోషానిస్తుందో… తండ్రి కాబోతున్న వార్త వినగానే మగవారు కూడా అంతే ఆనందానికి లోనవుతారు. గర్భం దాల్చడమంటే కేవలం ఆడవారికే బాధ్యతంతా అనుకంటే అది పొరపాటే. తల్లి కాబోతున్న భార్యకు మానసికమైన మద్ధతు భర్త నుంచే లభిస్తుంది. ప్రసవ సమయంలో భర్త పక్కన ఉండే ఆ ధైర్యమే వేరు. అందుకేనేమో కోహ్లీ కూడా అనుష్కకు మద్ధతుగా నిలవడానికి పితృత్వ సెలవులు తీసుకునిమరీ ప్రసవ సమయానికి ముందే భారత్ కు చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, దానిపై కొందరు విమర్శించిన వారు లేకపోలేదు. అలాంటి వారికి సమాధానం చెప్తూ కోహ్లీ ఒక వీడియో విడుదల చేశాడు.
నా భార్యతో ఉండాల్సిన సమయమిది
ఈ నిర్ణయం నేను ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. ఆస్ట్రేలియా టూర్ కు టీమ్ ని నిర్ణయించకమునుపే ఈ విషయమై నేను సెలక్టర్లతో మాట్లాడాను. వారు కూడా ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం మొదటి టెస్ట్ మ్యాచ్ అనంతరం నేను ఇండియాకు చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను నా భార్యతో ఉండాల్సిన సమయమిది. మానసికంగా తనకి నా మద్ధతు అవసరమైన సమయమిది. అందువల్ల నేను తనతో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన సమయం. మా మొదటి బిడ్డకు జన్మనిస్తున్న తరుణంలో నేను నా భార్య పక్కన ఉండడం సమంజసం.
స్టార్స్ అయితే మనసు ఉండదా
దీనిపై కొందరు విమర్శించడం చూస్తుంటే వారిపై జాలిపడాలో, మరేలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. సామాన్యుల సంగతి పక్కన పెడితే, కొందరు మాజీ క్రికెటర్లు సైతం వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం సిగ్గు పడాల్సిన విషయం. తండ్రి చనిపోయినపుడు తర్వాతి మ్యాచ్ ఆడిన కోహ్లీ, నేడు బిడ్డ కోసం పితృత్వ సెలవుపై వెళ్తున్నాడు అంటూ ఒక సీనియర్ క్రికెటర్ అనడం కచ్చితంగా ఖండించాల్సిన విషయం. అదే సమయంలో కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నవారు లేకపోలేదు.
Must Read ;- ఇన్ స్టాలో గ్రాముల కొద్దీ ‘రేణు’ గానామృతం











