వైసీపీ కార్యకర్త సింగయ్యను అత్యంత దారుణంగా కారుతో తొక్కి చంపిన ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. సింగయ్యను జగన్ కారు తొక్కుతున్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు A-1గా జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని చేర్చారు. A-2గా జగన్‌మోహన్ రెడ్డిని, A-3గా కారు యజమాని పేరును చేర్చారు. ఈ కారును జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ పేరిట కొనుగోలు చేశారు. జగన్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
సింగయ్యను కారుతో తొక్కిస్తున్న భయానక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్దేశపూర్వకంగానే సింగయ్యను బలి తీసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి జగన్ పల్నాడు పర్యటనకు పోలీసులు ముందే ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు సూచనలు చేశారు.కానీ జగన్, ఆయన బృందం వాటిని పట్టించుకోలేదు. అనుమతి లేని ర్యాలీని నిర్వహిస్తూ..కారు నుంచి బయటకు అభివాదం చేస్తూ రోడ్ మీద షో చేస్తూ ముందుకు సాగారు జగన్. ఈ క్రమంలో సింగయ్య మీద నుంచి జగన్ కారు వెళ్లింది.
ఇక ప్రమాదం జరిగిన తర్వాత సింగయ్యను ఎవరూ పట్టించుకోలేదు. రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి జగన్ కారు కింద పడలేదని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వీడియోల్లో అన్నీ బయటకు వచ్చాయి. జగన్ రెడ్డి మానవత్వం లేని మనిషి అని మరోసారి నిర్ధారణ అయింది. పోలీసులు ఇప్పటికే ఆ వృద్ధుడు జగన్ కారు కిందపడి చనిపోలేదని గతంలో చెప్పారు. తమ కారే తగిలిందని ఓ వ్యక్తి వచ్చి చెప్పడంతో అలా చెప్పారు. కానీ వీడియోలు వెలుగులోకి రావడంతో అసలు నిజం బయటపడింది.
వీడియోలు బయటకు వచ్చినప్పటికీ వైసీపీ నేతలు తమ బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఫ్యాబ్రికేటెడ్ వీడియోలంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజం కళ్ల ముందు ఉన్నా..నమ్మలేని గుడ్డిభక్తులుగా మారిపోయారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.