(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోమారు అస్వస్థతకు గురయ్యారు.దాంతో మంగళవారం ఆయన్ను కుటుంబసభ్యులు తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.సీతారాం రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.ఆదివారం నుండి అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగు పడకపోవడంతో విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన సీతారాం దంపతులు మే 12వ తేదీన కోవిడ్ నుంచి కోలుకున్నారు.సీతారాం కంటే ముందు ఆయన భార్య వాణిశ్రీకి వైరస్ సోకింది.దీంతో దంపతులిద్దరూ శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొంది అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లారు.అయితే సీతారం మళ్లీ అనారోగ్యానికి గురికావడంపై స్థానికంగా ఆందోళన నెలకొంది.
Must Read ;- వైసీపీ మంత్రిని ‘జిప్పుబాబా’తో పోల్చిన టీడీపీ నేత!











