AP Students Fires On CM Jagan :
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌క్యాలెండర్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన గళమెత్తుతున్నారు. రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని శాంతియుతంగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగులపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం వేలల్లో ఉద్యోగాలను మాత్రమే ప్రకటించటం మోసం చేయటమే కదా అని మండిపడుతున్నారు.
అక్రమ అరెస్టులు, కేసులు
రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోంది. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచుతోంది. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి, గృహనిర్బంధాలు చేయడం, కొన్నిచోట్ల పోలీస్ స్టేషన్లకు తరలించడం లాంటి చర్యలకు పాల్పడుతోంది. వినతిపత్రాలు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో ఒక హక్కు అని, దాన్ని అడ్డుకోవడం నియంతృత్వ పోకడ అవుతుందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.
పోలీసులతో కొట్టిస్తారా..?
నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని జగన్ హమీ ఇచ్చారని గుర్తు చేశారు. నాడు పాదయాత్రలో ముద్దులు కురిపించి నేడు పోలీసులతో కొట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ కోసం వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే.. ముఖ్యమంత్రి పోలవరం వెళ్లారని విమర్శించారు. మంగళవారం ఎంప్లాయిమెంట్ ఎక్చేంజి కార్యాలయంలో వినతి పత్రాలు అందించడానికి వెళ్లిన నేతలు, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సీఎం జగన్ కొత్తగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, లేకపోతే తగిన బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరిస్తున్నాయి.
Must Read ;- జగన్ గారు.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దు!
జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసి ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండ్ తో తెలుగు యువత మరియు విధ్యార్ధి సంఘాల ఆద్వర్యంలో ఈ రోజు చేసిన "ఛలో తాడేపల్లి..(1/3) pic.twitter.com/iRDBKansnO
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) July 19, 2021