బంజారాహిల్స్‌లో సినీ ఫక్కీలో ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరగడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కొడుకు కొండారెడ్డి ఈ కిడ్నాప్ ఉదంతానికి సూత్రధారిగా తెలుస్తోంది. ఆయనతోపాటు అయిదుగురు నిందితులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. కాకపోతే ఈ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
సినిమా డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్ ను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసేందుకు కొండారెడ్డి గ్యాంగ్ ప్రయత్నించింది. కడప జిల్లా టీడీపీ నేత వరదరాజులు కొడుకు కొండా రెడ్డి అతని అనుచరులు వీరంగం సృష్టించారు. కిడ్నాప్ చేసిన రౌడీలు.. షామీర్‌పేట్, కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాల పై సంతకాలు చేయించుకున్నట్లుగా పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొండా రెడ్డి తో పాటు రౌడీ గ్యాంగ్ ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 14 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి కొండారెడ్డి. అతని అనుచరులు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్ ద్వారా సంతకాలు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఐదుగురు వ్యక్తుల పై బంజారా హిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయింది.











