వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శత్రువులు ఇంట్లోనే ఉన్నారా.? ఆయన ఇంటి దొంగలను పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా..? చుట్టూ ఏర్పాటు చేసుకున్న కోటరీయే తనను ముంచుతోందా..? ముఖ్యంగా రాయలసీమలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విషయంలో జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇస్తోన్న సలహాలు పార్టీకి మైనస్‌గా మారుతున్నాయా..? అంటే అవుననే చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు..
ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ప్రధాన కారణం. పోస్టల్ బ్యాలెట్స్ తెరిచిన వెంటనే ఆ పార్టీపై, జగన్ పాలనపై ప్రజలలో ఎంతటి వ్యతిరేకత గూడు కట్టుకొని ఉందో అర్ధం అయింది వైసీపీ నేతలకి.. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను జగన్ తీవ్రంగా వేధించాడని, వారికి పీఆర్‌సీ పెంచకుండా అన్యాయం చేశాడని, ఇటు ఉపాధ్యాయులని కరోనా సమయంలో నాన్ టీచింగ్ విధులకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇవన్నీ వైసీపీపై వారిలో అసంతృప్తిని పెంచాయి.. ఆ పార్టీ ఓటమికి చేయొత్తి జై కొట్టారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు..
సీమలో కొన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు వైసీపీకి మద్దతుగా నిలుస్తాయట.. జగన్‌కి చేరువ కావడం కోసం ఈ ఉపాధ్యాయ సంఘాలు, వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని వాపోతున్నారు ఆ పార్టీ నేతలు.. వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్‌కి కడప, అనంతపురంలో చెప్పుకోదగ్గ నాయకత్వ ఉంది.. మిగిలిన జిల్లాలలో ఈ విభాగం బాగా వెనకబడి ఉందనేది వాస్తవం.. ఈ రెండు జిల్లాలలో మినహా రాష్ట్రంలో వైసీపీ టీచర్స్ అసోసియేషన్ ఉనికి లేదు..
తాజాగా కడప జిల్లాలోనూ ఎస్టీయూ, యుటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ లాంటి ఉపాధ్యాయ సంఘాలని వైసీపీకి దూరం చేయడంలో వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులే కారణమని వైసీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.. వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ నేతలు.. కడప ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డిని కలిసి… మిగిలిన యూనియన్ల నేతలపై పలు ఫిర్యాదులు చేస్తున్నారు.. వీటిపై ముందు, వెనకా ఎలాంటి విచారణ లేకుండా అవినాష్ రెడ్డి నమ్ముతున్నారు..
ఒక విభాగం ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే వారినే నమ్మి జగన్ దగ్గరికి ఇతరులు చేరకుండా దూరం పెడుతున్నారు అవినాష్ రెడ్డి..
అనంతపురం, కడప జిల్లాలలో కాస్తో కూస్తో సంఖ్యాపరంగా ఉన్న ఆ కొంతమంది ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు ఈ రాజకీయాలతో విసిగి వేసారిపోతున్నారు.. వారు కూడా ఇతర టీచర్స్ అసోసియేషన్‌లలోకి జంప్ చేస్తున్నారు.. దీంతో, అది కూడా మరింత బలహీన పడుతోంది.. ఇది అంతా అవినాష్ రెడ్డి అనాలోచిత, అపరిపక్వత రాజకీయాలే అని చెబుతున్నారు కొందరు వైసీపీ నేతలు.. జగన్ ఇప్పటికి అయినా తమ్ముడిని పక్కనపెట్టి, వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు.. మరి, ఇంటిదొంగను జగన్ పక్కన పెడతారో లేదో చూడాలి..