ఏపీలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని ప్రముఖ సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. వైసీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని బాలకృష్ణ హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. తనను విమర్శించే నాయకులు ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- ఆ గట్టునో, ఈ గట్టునో.. బంద్‌తో బయట పడనున్న వైసీపీ వైఖరి











