ఇటీవల కొడాలి నానికి, బాలయ్య వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం కార్యకర్తలు సహనాన్ని పరీక్షించవద్దని కాస్త ఘాటుగానే కొడాలి నానిపై విరుచుకుపడ్డారు నందమూరి బాలకృష్ణ. ఈ మాటలపై కొడాలి నాని ఎలాంటి రిప్లై ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, బాలయ్య మాటలకు నాని ఎక్కడా బహిరంగంగా కౌంటరివ్వలేదు. మామూలుగా ప్రతి పక్ష నాయకులు ఎవరు పార్టీ గురించి కానీ, అధినేత గురించి కానీ కాస్త నోరుజారినా సరే.. వెంటనే మీడియా ముందుకొచ్చి బూతు పురాణం మొదలుపెట్టే నానీ, బాలయ్య విషయంలో కాస్త తగ్గినట్టే కనిపించాడు. ఎక్కడ గానీ మీడియాలో బాలయ్య మాటలపై స్పందించిన దాఖలాలు కనిపించలేదు.
తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు వ్యాఖ్యలపై స్పందించినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ శిఖరం లాంటి వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున వ్యక్తితో కలిపి పనిచేస్తున్న బాలకృష్ణ మనస్తత్వం ఎలాంటిదని అందరికీ అర్థమవుతుందని, దానిపై ప్రత్యేకంగా స్పందించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడని, ఆయని మాటలకు ప్రాధ్యానం ఇవ్వాల్సిన పనిలేదని నానీ ఇంటర్వూలో భాగంగా చెప్పుకొచ్చారు. బాలయ్య స్థానంలో నేనండి, ఎన్టీఆర్‌కి, చంద్రబాబు చేసినట్టుగా ఎవరైనా నా తండ్రికి చేస్తే.. తను బాలయ్య లాగా ప్రవర్తించననీ, వాళ్లకు నేనేంటో చూపించి ఉండే వాడిననీ చెప్పుకొచ్చారు. మరి బాలయ్యను ఇంత మాటన్నందుకు బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి. మరి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏ విధంగా స్పందింస్తారో చూడాలి.
Must Read ;- నానీ నోరు అదుపులో పెట్టుకో, లేదంటే చేతల్లో చూపిస్తాం: బాలయ్య