మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. మూడేళ్ళ క్రితం ‘విజేత’ మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని రిజల్ట్ సరిగా రాకపోయినప్పటికీ.. అతడి తదుపరి అవకాశాలకి ఎలాంటి అడ్డంకి ఎదురవలేదు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ .. ‘సూపర్ మచ్చి, కిన్నెర సాని’ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు అతడు మరో మూవీలో కూడా నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీఏ 2 పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీతో రైటర్ శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
‘దూకుడు, నమో వెంకటేశ’ లాంటి సినిమాలకు పనిచేసిన శ్రీధర్ సీపాన .. కళ్యాణ్ దేవ్ తో ఇప్పుడు ఓ సూపర్ ఫ్యామిలీ కథ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో కళ్యాణ్ చెల్లెలి గా బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అరియానా గ్లోరీ నటించనుండడం విశేషంగా మారింది. ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశమిచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ఎంతగానో రుణ పడి ఉంటానని అరియానా ఈ సందర్బంగా చెప్పింది. ఇక అరియానా రాజ్ తరుణ్ నటించబోయే సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అరియానాకి బిగ్ బాస్ షో .. సినిమాల్లో నటించే అరుదైన అవకాశం కల్పించిందన్నమాట.
Must Read ;- గోవాలో వర్మను కలిసిన బిగ్ బాస్ బ్యూటీ