మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా అనుకున్న డేట్లో విడుదలవుతుందో లేదో అనే సందేహాలు తలెత్తాయి. ఖమ్మం లో వేడి ఎక్కువగా ఉండడంతో డీ హైడ్రేషన్ వల్ల చిరుకి ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే ఈ సినిమా షూట్ కి మరింత టైమ్ పట్టొచ్చని వార్తలొచ్చాయి.
అయితే ఈ షెడ్యూల్ ను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారట. ఆ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇంతకు ముందు ఇదే షెడ్యూల్ లో రామ్ చరణ్ , చిరుతో కలిసి షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో .. రామ్ చరణ్, పూజా హెగ్డేపై ఓ సాంగ్ కూడా చిత్రీకరించారట.
అలాగే.. ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేశారట. తదుపరి షెడ్యూల్ ను త్వరలో హైద్రాబాద్ లో చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘ఆచార్య’ సినిమా చిరుకి, చరణ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- మెగా ‘ఆచార్య’కు రామ్ చరణ్ ఎలాంటి శిష్యుడో?











