‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన రొమాంటిక్ చిత్రం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన అందాల తార పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో భాగ్యశ్రీ ఏ పాత్ర పోషిస్తోందో క్లారిటీ లేదు.
ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు భాగ్యశ్రీ. ఆ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ సినిమా విషయాలపై, తన పాత్రపై ఆమె కొన్ని విషయాలు తెలియజేసారు. ‘రాధే శ్యామ్’ సినిమాలో తాను ప్రభాస్ కు తల్లిగా కనిపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు భాగ్యశ్రీ. దర్శకుడు రాధాకృష్ణ ‘రాధే శ్యామ్’ కథను తనకు వినిపించాడని అందులోని నా పాత్ర సున్నితంగా ఉందని, స్టోరీ చెప్పిన వెంటనే షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాని తెలిపింది. తనకు, ప్రభాస్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపింది.
యువరత్నరాణా, ఓంకారం , అవునా లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన తాను చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తెలుగులో ఈ సినిమాను చెసాసని, ప్రభాస్ తో యాక్ట్ చేయడం సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాదిస్తుందని, తన పాత్రకు మంచి పేరు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. మరి తల్లీకొడుకులుగా భాగ్యశ్రీ, ప్రభాస్ లు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.











