కరోనా వ్యాక్సిన్ లో భారత్ బయోటెక్ మరో అడుగు ముందుకేసింది. నాజిల్ స్ప్రే కోసం ఈ సంస్థ వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ విజయవంతంగా రెండు ట్రయల్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో ఉంది. విజయవంతంగా ఈ దశ కూడా పూర్తి చేస్తే డీసిజీఐ, ఐసీఎంఆర్ అనుమతితో మార్కెట్ లోకి విడుదల కానుంది. కరోనాకు ముక్కు ద్వారా వాక్సిన్ ను తయారు చేసేందుకు వాషింగ్టన్ వర్సిటీ గత కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ ఆ వర్సిటీతో ఒప్పందం చేసింది. ఈ ఒప్పందంతో యూఎస్ఏ, యూరోప్, జపాన్ మినహ అన్ని దేశాలలో సరఫరా చేసేందుకు అనుమతి లభించింది.
నాజిల్ స్ప్రే లాభాలు
ఈ నాజిల్ స్ప్రే వ్యాక్సిన్ వాడటం ద్వారా సూదులు, సిరంజి వంటి వాడకం అవసరం ఉండదు. ఇదే సమయంలో వ్యాక్సిన్ ఖర్చు కంటే నాజిల్ స్ప్రే ఖర్చు చాలా తక్కువ. ఈ నాజిల్ స్ప్రే వ్యాక్సిన్ ఇప్పటికే మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసింది. మిగిలిన రెండు ట్రయల్స్ కూడా పూర్తి చేస్తే మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏకకాలంలో 100 కోట్ల డోసులను సిద్ధం చేయాలని కంపని నిర్ణయించింది. కరోనాకు వేరువేరు పద్దతుల ద్వారా వ్యాక్సిన్ ను సిద్ధం చేసేందుకు భారత్ బయోటెక్ ఎల్లపుడూ సిద్ధంగా ఉందని ఈ విషయంలో చాలా గర్వంగా ఉందని ఆ కంపెని సీఈఓ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.
రోగ నిరోధక శక్తీని పెంచేందుకు ఈ నాజిల్ స్ప్రే ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఓ జనరల్ ను ప్రచురించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులకు ఈ స్ప్రే ద్వారా చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు. మిగతా వ్యాక్సిన్ ల కంటే నాజిల్ స్ప్రే సమర్థవంతంగా పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోలియాకు చుక్కలు ఇచ్చినట్లే ముక్కుద్వారా ఈ వాక్సిన్ ను చుక్కల రూపంలో ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ కు ‘క్లోరోఫ్లూ’ అని పేరు పెట్టారు. అన్ని రకాల ట్రయల్స్ ను పూర్తి చేస్తే ఈ వ్యాక్సిన్ ను త్వరలోనే విడుదల చేస్తామని కంపని సీఈఓ ప్రకటన చేశారు.