వారం వ్యవధిలోనే పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. పంజాగుట్ట ఫ్లై ఓవర్ అత్యంత రద్దీ ప్రాంతం. హైదరాబాద్‌లోనే ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేస్ కూడా. అలాంటి ప్రాంతంలో రెండోసారి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, జనాలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన వారం వ్యవధిలోనే రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడంతో మరింత భయాందోళనలు నెలకొంటున్నాయి.
వారంలో ఇది రెండోసారి
మంగళవారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ పై మంటలు, పొగలు వ్యాపించాయి. అటుగా వెళ్లిన ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగలు వ్యాపించడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అర్పే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫ్లై ఓవర్ పై ప్రమాదం జరగడం ఇది రెండోసారి. మార్చి 12న ఫైబర్ డెకరేషన్‌లో మంటలు వ్యాపించి ప్రమాదం జరిగింది. ఈ రోజు జరిగిన ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ తోనా లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Must Read ;- బుల్లెట్ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా? : కేటీఆర్