ముంబైలోని కొవిడ్ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. భందూప్‌లోని డ్రీమ్స్ మాల్ సన్‌రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయానికి హాస్పిటల్‌లో 76 మంది కోవిడ్ రోగులున్నట్టు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదంలో సమయంలో కొంతమంది గాయాలు కాగా, ఇద్దరు చనిపోయారు. తాజాగా మృతుల సంఖ్య 9 మందికి చేరుకుంది. ప్రమాదానికి గల కారణం తెలియదని, దీనిపై దర్యాప్తు సాగుతోందన్నాని పోలీసులు తెలిపారు.
Must Read ;- బాలీవుడ్ సూపర్ స్టార్ కు కరోనా పాజిటివ్