ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ జనవరి 7న రావాల్సింది కానీ.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇటీవల రాజమౌళి మార్చి 18న కానీ ఏప్రిల్ 28న కానీ ఆర్ఆర్ఆర్ విడుదల కానున్నట్టుగా ప్రకటించారు.
అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో బిగ్ ఛేంజ్ అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ భారీ సినిమా వచ్చే మార్చ్ 25 నే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ డేట్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టు వినిపిస్తుంది. ఇక దీని పై అధికారికంగా అప్ డేట్ రావాల్సివుంది. ఈ డేట్ కి ఎందుకు రావాలి అనుకుంటున్నారంటే… ప్రభాస్ రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కన్ ఫర్మ్ అంటున్నారు.
రాధేశ్యామ్ రిలీజ్ కి రెండు వారాల గ్యాప్ అంటే మార్చి 25కి అయితే… బాగుంటుందని… ఆతర్వాత ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాల రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మరి.. త్వరలోనే ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల అని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.