రాష్ట్రంలో పునర్విభజన మంటలు!
అర్థరాత్రి అర్థాంతరంగా జిల్లాల సరిహద్దులను మారుస్తూ.. జీవో తీసుకొచ్చింది జగన్ రెడ్డి ప్రభుత్వం! ఏపీలో ఉన్న 13 జిల్లాలు కాస్తా పునర్విభజనతో 26 జిల్లాలుగా ఏర్పాడ్డాయి. అయితే జిల్లా పునర్విభజనలో రాజకీయ, సామాజీక, మేధావులను నుంచి ఎటువంటి సూచనలు తీసుకోలేదని సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. విభజన ఏకభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడమేకాక, ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు నిర్వహించేందుకు అధికారపార్టీ పావులు కదుపుతోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు జిల్లాల పునర్విభజన పై అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యే లు పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్రంపై నరసాపురం – భీమవరం మధ్య మాటలు.. సెగలు, పొగలు కక్కుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రసాదరాజు డిమాండ్ చేస్తుంటే.. భీమవరం కేంద్రంగా జిల్లాను ఉంచాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇరువురు కలెక్టర్ కు విడివిడిగా వినతి ప్రతాలు కూడా సమర్పించారు. ఇదే అంశం ప్రస్తుతం అధికార వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
సీఎం సొంత జిల్లాలో తీవ్ర వ్యతిరేకతలు!
జిల్లా పునర్విభజన విషయంపై ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించడాన్ని ఇక్కడి ప్రజలు భగ్గుమంటున్నారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ డిమాండ్ పై అధికారపార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేస్తున్న వినూత్న నిరసనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జిల్లాలో వివిధ గ్రామాల్లో ‘వైసీపీకి ఇక సెలవు’ అంటూ హైవేలపై హోర్డింగ్ లు పెట్టారు. మరోవైపు రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో ఇక్కడి ప్రజాప్రతినిధులు కనిపించడం లేదని.. వీరి ఆచూకీ తెలయజేయాలి అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి.
Must Read:-రఘురామ సెటైర్లతో జగన్ ఉక్కిరిబిక్కిరి