తెలుగు రియాల్టీ షోస్ లో హైయస్ట్ రేటింగ్స్ దక్కించుకున్న షో ‘బిగ్ బాస్’ అని చెప్పాలి. ఇప్పటివరకూ 4 సీజన్స్ ను విజయవంతంగా నడిపిన నిర్వాహకులు ప్రస్తుతం బిగ్ బాస్ 5 సన్నాహాల్లో ఉన్నారు. మొదటి సీజన్ కు యన్ఠీఆర్, రెండో సీజన్ కు నానీ, మూడు , నాలుగు సీజన్స్ కు నాగార్జున హోస్ట్ గా వ్యహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ 5 కి కూడా నాగార్జునే హోస్టింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 4 కోవిడ్ కారణంగా.. లాస్టియర్ చాలా లేట్ గా అంటే.. సెప్టెంబర్ 6న మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఐదో సీజన్ ను జూలైలోనే ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్ లో ఇద్దరు హీరోలు, ఐదుగురు హీరోయిన్స్ కంటెస్టెంట్స్ గా రాబోతున్నారట. అలాగే.. కొందరు యూ ట్యూబ్ స్టార్స్ ఉండబోతున్నారట. అంతేకాదు ఈ సీజన్ లో గ్లామర్ డోస్ ను కూడా బాగానే పెంచబోతున్నారట.
త్వరలో జెమినీ టీవీలో యన్టీఆర్ హోస్ట్ గా చేయబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రసారం కాబోతోంది. ఈ సీజన్ కంప్లీట్ అవగానే.. బిగ్ బాస్ 5ను మొదలు పెట్టే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. మరి బిగ్ బాస్ 5 ఏ రేంజ్ లో ఆసక్తికరంగా ఉండనుందో వెయిట్ అండ్ సీ..
Also Read : వెబ్ సిరీస్ గా ‘బిగ్ బాస్ 4 లవ్ స్టోరీ