లాక్ డౌన్ పుణ్యమా అని.. చాలా మంది సినీ సెలబ్రిటీలు .. తమలో అంతర్లీనంగా దాగి ఉన్న టాలెంట్ ను వెలికితీసి.. జనాన్ని ఆశ్చర్యపరిచారు. కొందరు పెయింటింగ్స్ లో కింగ్స్ అనిపించుకుంటే.. మరికొందరు వంటల్లో నలభీములు అనిపించుకున్నారు. ఇంకొందరు మాత్రం డ్యాన్సులతో హోరెత్తిస్తూ.. మైకేల్ జాక్సన్‌లు అయిపోయారు. అలాంటి వారి జాబితాలో ముందుగా చెప్పుకోదగ్గ పేరు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.
ఇంతకు ముందు బాహుబలి డైలాగ్ తో పాటు భార్యతో బుట్టబొమ్మ పాటకు స్టెప్స్ వేసిన వార్నర్.. ఇప్పుడు మళ్ళీ మరోసారి తన టాలెంట్ కు మెరుగుపెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ లా, అరవింద సమేతలో యన్టీఆర్ సిక్స్ ప్యాక్ , అమితాబ్ లుక్స్ లో తాను ఎలా ఉంటాను అని వార్నర్ మార్ఫింగ్ చేసిన వీడియోల్ని షేర్ చేశాడు. ఈ పోస్టులపై జనం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
View this post on Instagram
Must Read ;- వార్నర్ చెప్పిందే జరుగుతోంది హైదరాబాధ తీరదు