‘ఆకాశరామన్న’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు జి.అశోక్ . తొలి సినిమా అంతగా సక్సెస్ సాధించలేకపోయినా నానీ హీరోగా ‘పిల్లజమీందార్’ అవకాశం అందుకొని బిగ్గెస్ట్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలతో వరుసగా పరాజయం ఎదుర్కొన్నప్పటికీ.. అందాల అనుష్క తో భారీ ఎత్తున భాగమతి సినిమా తీసి.. సూపర్ హిట్టు కొట్టాడు.
ఇదే సినిమాను ‘దుర్గావతి’ గా బాలీవుడ్ లో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు అశోక్. భూమి పడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను అక్షయ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే .. అశోక్ మరో బ్రహ్మాండమైన బాలీవుడ్ ఆఫర్ పట్టాడని తెలుస్తోంది.
థ్రిల్లర్ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా.. పుష్పక విమానం తరహాలో ఎలాంటి డైలాగ్స్ లేకుండా సైలెంట్ మూవీగా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. దీనికోసం ఉఫ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. సున్రత్ బారుచా, నోరా ఫతేహి ప్రధానపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.










