తిరుపతిలో హైటెన్షన్ మొదలైంది. ఆలయాలపై దాడిని నిరసిస్తూ.. టీడీపీ పార్టీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు పోలీసుల నుంచి అనుమతులు రద్దు చేసినందున ముందుస్తుగా టీడీపీ నేతలను అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎందరిని అరెస్టుల పేరుతో నిర్భందించినా కూడా తమ యాత్ర ఆగదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కనీసం గదిలో నుండి మమ్మల్ని బయటకు కూడా వదలకుండానే నిబంధనలను ఉల్లంఘించామని అరెస్టులు చేయడం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అసుల పోలీసులు తెలివుండే ప్రవర్తిస్తున్నారా అంటూ పోలీసుల ప్రవర్తనపై ఫైర్ అయ్యారు అచ్చెన్న.
పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత బయలుదేరుతున్నప్పుడు అనుమతి రద్దు చేసి నిబంధనలను ఉల్లంఘించాం అనే పేరుతో అరెస్ట్ చేస్తే అర్ధముందా అని ప్రశ్నించారు. మేమసలు బయలుదేరకముందే నిబంధనల ఉల్లంఘన పేరుతో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మేము తప్పకుండా మా యాత్ర ప్రారంభిస్తామని అచ్చెన్న తెలియజేశారు. కాగా, అచ్చెన్నాయుడు బస చేసిన హోటల్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. హోటల్లోకి ఎవరినీ పోనీవ్వకుండా, అలాగే టీడీపీ నాయకులను హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Must Read ;- భూకంపం వచ్చినా ధర్మపరిరక్షణ యాత్ర ఆగదు : అచ్చెన్నాయుడు











