ఎంపీ కేశినేని నానీ కావాలా… పార్టీ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన మేము కావాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేల్చాలని పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ డిమాండ్ చేశారు. ప్రజారాజ్యంలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బహిష్కరణ గురైన కేశినేని నాని టీడీపీలోనూ అలాగే చేస్తున్నాడని బోండా ఉమ తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీ కేశినేని విజయవాడకు తానే టీడీపీ అధిష్టానం అనడం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ కోసం కష్టపడే మేము కావాలో, కేశినేని కావాలో చంద్రబాబు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు విజయవాడలో చంద్రబాబు నిర్వహించే ప్రచారంలో తాను పాల్గొనడం లేదని బోండా ఉమ స్పష్టం చేశారు.
మాకు అధిష్టానం చంద్రబాబు నాయుడే..
చంద్రబాబు నాయుడు గారే మాకు అధిష్టానం.. ఏ గొట్టంగాడు మాకు అధిష్ఠానం కాదంటూ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఫైర్ అయ్యారు. ఎంపీ కేశినేని నాని టీడీపీని కుల సంఘంగా మార్చాలని అనుకుంటున్నాడా అంటూ బోండా ఉమ తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని పార్టీలో పదవుల కోసం పనిచేస్తున్నాడని, తాము మాత్రం పార్టీ కోసం పని చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పనిచేస్తున్నామని బోండా ఉమ అన్నారు. ఎంపీ కేశినేని నాని వ్యవహారశైలితో పార్టీకి బీసీలు దూరం అవుతున్నారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.
Must Read ;- ఆ రోజే చెప్పుతో కొట్టేవాడిని.. కేశినేనిపై బుద్దా వెంకన్న ఫైర్











