టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకులంటే ఇష్టమని, ఎవరైనా తన వెనుక రావాల్సిందే గాని.. తాను ఎవరి వెనుక వెళ్లనని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన సామంతులు పార్టీకీ నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారన్నారు. ఓడిపోయే అభ్యర్థులను మార్చితే తప్పేమిటని అన్నారు. ఈ సమయంలో అందరూ కలిసి రాకపోతే పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదా అని అన్నారు. వారిని గాడిలో పెట్టకపోతే పార్టీకే నష్టమన్నారు. ముస్లిం సోదరుల కోసం చంద్రబాబుని కూడ కాదని నిలబడ్డానని పేర్కొన్నారు. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు నమ్మరని, తనకు ప్రజల్లో ఉన్న నమ్మకంతో పార్టీని గెలిపిస్తానన్నారు. తాను. తన అమ్మాయి మేయర్ పదవి కోసం పాటు పడటం లేదని, పార్టీ కోసం కష్టపడుతున్నామని అన్నారు. తమకు ఏ పదవులు అక్కర లేదని పేర్కొన్నారు.
Must Read ;- విజయవాడ టీడీపీలో రచ్చ కెక్కిన విభేదాలు.. అరికట్టక పోతే దిగులే











