సూపర్ స్టార్ ల పారితోషికం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే కదా. అలాంటి సూపర్ స్టార్లు సినిమా షూటింగుల్లో పాల్గొనాలంటే సాధారణ కార్వాన్ ఏంబాగుంటుంది. అందుకే కాస్టీ కార్వాన్ ల వైపు వీరు మొగ్గు చూపుతున్నారు. ఇంతకుముందు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కొన్న కార్వాన్ గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి తన కోసం ఈ ప్రత్యేక కార్వాన్ ను అర్జున్ తయారుచేయించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ కూడా అలాంటి కార్వాన్ మీద దృష్టి పెట్టి సాధించారు.
మహేష్ కొన్న కొత్త కార్వాన్ రంగంలోకి దిగిపోయింది. దీనికోసం అతను భారీ గానే ఖర్చు చేసినట్టు సమాచారం. ముంబయికి చెందిన ఓ ఇంటీరియర్ డిజైనర్ మహేష్ అభిరుచికి అనుగుణంగా దీన్ని తయారుచేసినట్టు చెబుతున్నారు. తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో మహేష్ బాబు ఒకరు. మహేష్ ఏది చేసినా తన స్థాయికి తగ్గకుండా చూసుకోడు. అందుకే ఏ విషయంలోనూ తగ్గకూడదని ఈ కార్వాన్ తయారుచేయించుకున్నాడు.
కార్వాన్ ఇంటీరియర్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ కార్వాన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. రాజమౌళితో ఓ సినిమా చేయడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు. నటనలోనే కాదు కార్వాన్ ల విషయంలో కూడా మన హీరోలు పోటీపడుతున్నట్టు ఉంది కదూ.
Must Read ;- యంగ్ టైగర్ కాస్ట్లీ కార్ చూతము రారండీ!