మద్యం తాగి వాహనం నడపటమే కాదు, మద్యం తాగి నడుపుతున్న వారి వాహనంలో ప్రయాణించినా ఇకపై కేసులో ఇరుక్కుంటారు జాగ్రత్త. కొత్త చట్టాన్ని ఉపయోగించి తాగిన వ్యక్తి నడిపే వాహనంలో ప్రయాణించేవారిపైనా కేసులు పెట్టనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని 188వ సెక్షన్ ప్రకారం తాగిన వ్యక్తి నడుపుతున్న వాహనంలో ప్రయాణించేవారిపైనా కేసులు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ట్విటర్ లో వెల్లడించారు.
Also Read : రేషన్ డెలివరీ వాహనం ఎక్కిన నిమ్మగడ్డ.. నిర్ణయం ఏం తీసుకుంటారో..?
మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా?
అయితే అతనితో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. https://t.co/vW77IpXruI
— Cyberabad Police (@cyberabadpolice) March 11, 2021











