భార్య చేతిలో వంచనకు గురవడం ఆ మనిషిని మృగంలా మార్చింది. ఆ ఒక్క సంఘటన అతనిలో నిగూఢంగా నిద్రిస్తున్న రాక్షసుడిని నిద్రలేపింది. అతనికి సమాజంపైనే విరక్తి కలిగింది. మహిళ పేరు వింటేనే ఒళ్లంతా ఊగిపోయేది. అది క్రమేపీ పైశాచికత్వంగా మారింది. మహిళలే లేకుండా చేయాలనే.. ఓ రకమైన మానసిక రాక్షసత్వం అతనిలో నిద్రలేచింది. ఇదీ.. 18 మంది మహిళలను అతి కిరాతంగా హతమార్చిన సైకో కిల్లర్ కథ ఇది. అసలేం జరిగింది? అతనిలో ఆ రాక్షసత్వానికి కారణమేంటి?
చిన్నతనంలోనే పెళ్లి.. ఆపై భార్య..
సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల గ్రామానికి చెందిన మైనా రాములుకి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మొదటి నుంచి భార్య అతనితో సక్రమంగా ఉండేది కాదు. ఓ రోజు వేరే అతనితో వెళ్లిపోయింది. దీంతో మెంటల్‌గా అప్సెట్ అయ్యాడు. అప్పటి నుంచి అతను వింతగా ప్రవర్తించేవాడు. అతని బిహేవియర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేది. అప్పటి నుంచి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మహిళలను టార్గెట్ చేసుకుని దుర్మార్గుడు చెలరేగిపోయాడు.
రాక్షసత్వం… మహిళలే లక్ష్యం!
భార్య చేతిలో వంచనకు గురవడం ఆ మనిషిని మృగంలా మార్చింది. శివారు ప్రాంతాలు, కల్లు కాంపౌండ్ల వద్ద కనిపించే ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు తెగబడ్డాడు. గతంలో 16 మంది మహిళలను హత్య చేసి జైలుకు వెళ్లి బయటికొచ్చాడు రాములు. కానీ ఆ తర్వాత కూడా ఏ మాత్రం మారలేదు. ఘట్‌కేసర్, బాలానగర్ ఠాణాల పరిధిలో మరో ఇద్దరు మహిళలను కిరాతకంగా హతమార్చాడు. నిందితుడు 2003 నుంచి వరుస నేరాలకు పాల్పడి మొత్తం 18 హత్యలు చేసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. పక్కా ఆధారాలు సేకరించిన ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడు రాములును చాకచక్యంగా పట్టుకున్నారు.
తీగలాగితే.. కేసులన్నీ బయపడ్డాయి..
ఈ నెల 4న ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలు జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీకి చెందిన వెంకటమ్మగా గుర్తించారు. ఘట్‌కేసర్, ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. వెంకటమ్మ ఓ వ్యక్తితో కలిసి ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఫోటోను సేకరించిన పోలీసులు…. పాత నేరస్థుడిగా గుర్తించారు. రాములు…. మహిళలపై ద్వేషంతోనే హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో 16 హత్యలు, 4 దొంగతనాలు చేసిన రాములు… గతేడాది జూలైలో జైలు నుంచి బయటికి వచ్చి మరో రెండు హత్యలు చేసినట్లు హైదరాబాద్ సీపీ వివరించారు.
Must Read ;- భార్యను కాల్ గర్ల్‌గా చిత్రీకరించిన భర్త
“చిన్న వయసులో పెళ్లి చేసుకున్న రాములు.. తన భార్య విడిపోవడంతో అప్పటి నుండి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మానసికంగా దెబ్బ తిన్న రాములు.. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. మొదట ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేశాడు. అతని చేతిలో హత్యకు గురైన వారందరూ కూడా మహిళలే. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 మందిని.. ఇలా అతను మొత్తం 18 మంది మహిళలను హత్య చేశాడు.”
– అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్