పేదవారికి రేషన్ ఇంటికే అందించాలనే లక్ష్యంలోనే రేషన్ డెలివరీ వ్యాన్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం కోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. అయితే వీటికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చినా.. కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు. రేషన్ డెలివరీ వాహనాలపై ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి గుర్తులు ఉండరాదని, పార్టీ జెండా రంగులు వేయరాదని, అలాగే అధికార పార్టీ నాయకులెవ్వరూ డెలివరీలో సమయంలో ప్రచార హడావిడి చేయకూడదని చెప్పింది. అంతేకాదు, ఎన్నికల కమిషన్ నిర్ణయం కూడా కీలకమని వ్యాఖ్యనించింది. పేదలకు సంబంధించిన పథకం కనుక ఆలోచించమని ఎస్ఈసీకి కోర్టు విన్నవించడంతో.. నిమ్మగడ్డ స్వయంగా వాహనాలను పరిశీలించారు.
డ్రైవర్ స్థానంలో కూర్చుని వాహాన కండీషన్ని పరిశీలించారు. బండిపై రంగులను, గుర్తులను, వ్యాఖ్యాలను నిశితంగా పరిశీలించారు. ఫిబ్రవరీ 1 నుండే ప్రారంభం కావాల్సిన ఈ పథకం ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నకల కమిషన్ నిర్ణయంపై అంతా ఆధారపడి ఉండడంతో.. నిమ్మగడ్డ ఏం నిర్ణయం తీసుకుంటారో అని ప్రభుత్వం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.
Must Read ;- రేషన్ సరఫరా పథకం వాయిదా..