జై అమరావతి .. జైజై అమరావతి అంటూ సాగిన నినాదం..!
డిసెంబర్ 17, 2019 ..! ఈ తేదీనా జగన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రపోజల్ తెరపైకి తెచ్చాడు. ఆనాటి నుంచి నేటి వరకు 725 రోజులుపాటు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు. ఒకటే రాజధాని అదే మేం.. ప్రభుత్వాన్ని నమ్మి భూమిలిచ్చిన రాజధాని అమరావతేనని నినదించారు. రైతుల నిరసన ఉద్యమంలో భాగంగానే అమరావతి పరిరక్షణ జేఏసీ సభ్యులు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ మహాపాద యాత్రకు నవంబర్ 1న తుళ్లూరు నుంచి శ్రీకారం చుట్టారు. నిస్వార్థమైన రైతు పాదయాత్రకు రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపారు. అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, దళిత సంఘాలు పూర్తి మద్దతను ప్రకటించాయి. తెలుగుదేశం, జనసేన, బిజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు పాదయాత్రను ముందుండి నడిచారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదిగా చిత్తూరు చేరిన పాదయాత్ర 44 రోజులపాటు నిర్వీరామంగా సాగింది. అడుగడుగునా రైతులకు జన నీరాజనాలు పలికారు. పూలతో పాదయాత్ర అసాంతం ముంచెత్తారు. అక్కున చేర్చుకుని అన్నపెట్టి, వసతులను కల్పించారు. అధికారపార్టీ ఒత్తుళ్లు, పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా రైతులకు నాలు జిల్లా రైతులు వెన్నుదండుగా నిలిచారు. సుమారు 42 కేసులను వివిధ కారణాలతో రైతులపై నమోదు చేశారు పోలీసులు. అయినా వారి సంకల్పం ఎక్కడ సడలలేదు. జై అమరావతి .. జైజై అమరావతి అంటూ రైతులతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రాల రైతులు సైతం రాజధాని రైతుల పాదయాత్ర వెంట సాగారు. అంతేకాక పాదయాత్రలో వారికి తోచినంత ఆర్థిక సాయాన్ని కూడా అందజేశారు.
అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసిన పాదయాత్ర..!
44 రోజులు పాటు సుదీర్ఘంగా 500 కిలోమీటర్ల పాదయాత్రగా నడిచి వచ్చిన రాజధాని రైతులు తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంత వారి పాదయాత్రను 108 కొబ్బరికాయాలు కొట్టి విరమించారు. పాదయాత్ర చివరి రోజు కావడంతో తెలుగుదేశం, బీజేపీ, వామపక్ష, పలు ప్రజా, రైతుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు. అశేషంగా తరలివచ్చిన జగసంద్రోహాన్ని చూసి రైతులు భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు. పాదయాత్ర ముగిసిన సందర్భంగా రోజుకు 500 మంది చొప్పున మూడు రోజులు పాటు శ్రీవారి దర్శనానికి రైతులు వెళ్లనున్నారు. ఆ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే స్వామి వారి దర్శన అనంతరం 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. అధికారుల అనుమతుల నిరాకరణతో సభ నిర్వహణపై ఇప్పటికే హైకోర్టును జేఏసీ సభ్యులు ఆశ్రయించారు. సభ నిర్వహాణపై రేపు రానున్న కోర్టు డైరెక్షన్ కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.










