పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ భారీ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. సినిమా ప్రమోషన్స్ లో బాగా వెనకబడిన రాధేశ్యామ్ ఇక నుంచి స్పీడు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వరుస అప్ డేట్స్ తో సినిమా పై భారీగా హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. దీని కోసం గ్రాండ్ ఈవెంట్ ను.. డిఫరెంట్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇంతకీ విషయం ఏంటంటే… రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 23వ తేదీన ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.
అయితే.. ఈ ట్రైలర్ ను ఎవరితో విడుదల చేయనున్నారు అంటే… ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అభిమానుల చేత ట్రైలర్ లాంఛ్ చేయించాలి అనుకుంటున్నారట. ఇదే కనుక నిజమైతే… ఒకే రోజున డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. తమ ఫేవరేట్ హీరోని చూడటమే కాకుండా.. ట్రైలర్ ను ఆవిష్కరించే అవకాశం దక్కినట్లే. మరి.. ఈ ఈవెంట్ గురించి త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
Must Read ;- సంక్రాంతి బరిలో త్యాగం చేసేది ఎవరు?











