కరోనా చికిత్స కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-DG మందు ధర ఖరారు చేశారు.పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్కో ప్యాకెట్ ధరను రూ.990గా నిర్ణయించినట్టు,మందును ఉత్పత్తి చేస్తున్నడాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం తక్కువ ధరకే ఈ మందు సరఫరా చేయాలని కంపెనీ నిర్ణయించింది.అయితే ఈ ధర ఇంకా ఖరారు కాలేదు.ఈ మందును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్,డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది.చాలా సులువుగా దీన్ని ఉపయోగించవచ్చు.కరోనా రోగులు నీటిలో కలుపుకుని తాగేలా పొడి రూపంలో దీన్ని తీసుకువచ్చారు.ఇప్పటికే అత్యవసర వినియోగం కింద 20 వేల ప్యాకెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
శరీరంలో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుంది
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్,డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-DG మందు కోవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకుండా చేస్తుంది.దీని వల్ల కణ విభజన జరగక,శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ మందుకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా దేశంలో మరో నాలుగైదు కంపెనీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.గతంలో ఈ మందును క్యాన్సర్ ఔషధంగా ఉపయోగించారు.దీన్నే ఇప్పుడు పరిశోధనలు చేసి కరోనా వైరస్‌ను అడ్డుకునే విధంగా రూపొందించారు.
Must Read ;- వుహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్-19.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం











